రైతు కుటుంబాలకు 14 ఏళ్ల బాలుడి చేయూత

రైతు కుటుంబాలకు 14 ఏళ్ల బాలుడి చేయూత
x
ప్రాజెక్టు గురించి వివరిస్తున్న రిషి
Highlights

చాలామంది పిల్లలు వేసవికాలం వచ్చిందంటే చాలు సెలవుల్లో వారి అమ్మమ, నాయనమ్మ ఇండ్లకు వెళ్లి ఆడుకుందామని చూస్తారు. ఇంకొంత మంది మాత్రం రాబోయే తరగతిలో ఏ...

చాలామంది పిల్లలు వేసవికాలం వచ్చిందంటే చాలు సెలవుల్లో వారి అమ్మమ, నాయనమ్మ ఇండ్లకు వెళ్లి ఆడుకుందామని చూస్తారు. ఇంకొంత మంది మాత్రం రాబోయే తరగతిలో ఏ పాఠ్యాంశాలు ఉంటాయి వాటిని ఎలా చదువుకోవాలి అంటూ సెలవుల నుంచే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు మాత్రం వారికి భిన్నంగా ఉన్నాడు.

రిషివర్మ అనే 14 ఏళ్ల కుర్రాడు తన పాఠశాల సెలవు రొజుల్లో వాళ్ల నాయనమ్మ ఇంటికి తన తల్లిదండ్రులు నీలిమ, మహిదర్ రవికుమార్ లతో కలిసి వెళ్లేవాడు. వాళ్ల సొంతూరైన ప‎శ్చిమగోదావరి జిల్లా కాళ‌్ల మండపంలోని కళ్లకూరులో రైతులు పడే కష్టాలని చూసి చలించిపోయాడు. దీంతో ఆ బాలుడు కష్టాల్లో ఉన్నవారికి చేయూతని ఇవ్వాలనుకున్నారు. ఆర్థికంగా వాళ్లకి అండగా ఉండాలనుకున్నాడు. అదే ఆలోచనతో 'స్వయం కృషి' పేరుతో ఒక ప్రాజెక్టుని తయారు చేశాడు. ఈ ప్రాజెక్టులో గ్రామస్తులతో ఆహారఉత్పత్తుల తయారు చేయించి వారికి అదనంగా డబ్బులు సంపాదించడానికి ఈ ప్రాజెక్టుని రూపొందించాడు.

ఇదిలా ఉంటే అనుకోకుండా ఫిబ్రవరిలో నెలలో రిషి చదివే పాఠశాలకు ఐరాసకు అనుంబంధంగా పనిచేసే 1మిలియన్ 1బిలియన్ సంస్థ సభ్యలు వచ్చారు. వీళ్లు పాఠశాలలో ఫ్యూచర్ లీడర్స్ అనే కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఇదే చక్కటి అవకాశం అనుకుని రిషివర్మ తన ఆలోచనలను వేదికై వివరించారు. తాను చేసిన ఆలోచన ఎంతో గొప్పదని తన ఆలోచన అందరికీ ఉపయోగపడుతుందని అనుకున్న సంస్థ సభ్యులు రిషిని ఈ ఫ్యూచర్ లీడర్ కార్యక్రమానికి ఎంపిక చేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రిషి తన ఆలోచనలను ప్రపంచ వ్యాప్తంగా వివరించనున్నాడు.

తాను తయారు చేసిన ప్రాజెక్టులో భాగంగా పాలకోవా, పూతరేకులు, తాటితాండ్రాతో పాటు మరికొన్ని ఆహార పదార్ధాలను సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేయించి విక్రయిస్తున్నారని తెలిపారు. తాను ఈ ప్రాజెక్టుని నలుగురు మహిళలతో ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు దినదినాభివృద్ధి చెంది 15 మందితో కొనసాగుతుంది. ఇంతేకాక ఈ ప్రాజెక్టు ద్వారా మరికొంత మందికి చేయూత నివ్వాలని, గ్రామస్తులు ఆర్థికంగా ముందంజలో ఉండేందుకు మరింత కృషి చేస్తానంటున్నాడు ఈ బాల రుషి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories