Anantapur: HMTV కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు

80 Years Old Woman not Getting YSR Pension Kanuka because of 16 Years Age on Aadhar Card | AP News Today
x

HMTV కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు

Highlights

Anantapur: ఆధార్ కార్డులో 80 ఏళ్లకు బదులు 16 ఏళ్లు ఉండటంతో ఫించన్ తొలగింపు...

Anantapur: HMTV కథనానికి అనంతపురం జిల్లా ఉరవకొండ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఉరవకొండకు చెందిన షేక్ అమీనా బీ అనే 80 ఏళ్ల వృద్దురాలకు ఆధార్ కార్డులో 16 ఏళ్లు ఉండటంతో ఆమె ఫించన్‌ను తొలగించారని HMTVలో ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు.

ఆధార్ కార్డులో వృద్ధురాలి వయసు మార్పు, ఫించన్ వచ్చే విధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫించన్ పాస్ బుక్, ఓటర్ ఐడీ కార్డు, బ్యాంక్ వివరాలను సేకరించారు. ఆధార్ హెల్ప్ డెస్క్ వివరాలను అప్‌లోడ్ చేశామని ఉరవకొండ తహశీల్దార్ మునివేలు తెలిపారు. ఆధార్ కార్డులో వృద్ధురాలి వయసు మార్పు అనంతరం ఫించన్ వచ్చే విధంగా చేస్తామని తహశీల్దార్ మునివేలు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories