Andhra Pradesh: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Andhra Pradesh: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
x
Highlights

మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవంలో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

వెంకటాచలం: మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవంలో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య వేడుకలను, గణతంత్ర వేడుకలను మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం అన్నారు.రాజ్యాంగ స్ఫూర్తితో దేశానికి సంబంధించి, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాము. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి వచ్చిందని, రాజ్యాంగ స్ఫూర్తికి అవాంతరాలు కలిపిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నదని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు.

రాజ్యాంగ స్పూర్తితో ముందుకు వెళ్తూ, ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చూపించిన మార్గంలో నడవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, దేశంలో అనేక కులమతాలు మిళితమై ఉన్నా, అందరం కలిసి మెలిసి ముందుకు నడుస్తున్నామంటే మహనీయుడు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మదనపల్లి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. అనంతరం డివిజన్ స్థాయిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికను ఉపన్యసించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 277 మందికి సబ్ కలెక్టర్ గారు ప్రసంశా పత్రాలు మొమెంటోలను అందజేశారు. స్థానిక జడ్.పి హై స్కూల్ విద్యార్థులచే సుమారు 700 అడుగులు కలిగిన జాతీయ జండాను ప్రదర్శించారు. పట్టు పరిశ్రమ, వ్యవసాయ, ఉద్యాన, మెప్మా, ఐ.సి.డి.ఎస్. డి.ఆర్.డి.ఏ మునిసిపల్ శాఖ, డ్వామా శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సబ్ కలెక్టర్ గారు పరిశీలించారు.

పోలీసు శాఖ, ఎన్.సి.సి, స్కౌట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవాతు ను ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు ఎం. నవాజ్ బాష, పలమనేరు డి.ఎస్. పి ఆరీఫుల్ల, తహసీల్దార్ సురేష్ బాబు, సబ్ కలెక్టర్ కార్యాలపు డి.ఏ.ఓ షమ్షీర్ ఖాన్, ఎం.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, జడ్.పి ఉన్నత పాటశాల ప్రధాన ఉపాద్యాలు రెడ్డెన్న శెట్టి, డివిజినల్ అగ్నిమాపక శాఖ అధికారి పురుషోత్తం నాయుడు, ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్, వివిధ శాఖల అధికారులు, స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories