
స్థానిక సంస్థల ఎన్నికలు సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్ని వ్వూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. అధికార...
స్థానిక సంస్థల ఎన్నికలు సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్ని వ్వూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. రెండు పార్టీల మధ్య దాడులు చేసుకునే వరుకు వెళ్లింది. అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బీజేపీతో కలసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పలు చోట్ల తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది.
ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున 70 ఏళ్ల బామ్మ నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి నల్లమోతు భారతి జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 70 ఏళ్ల భారతి జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భారతిను అభినందించారు.
మరోవైపు జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ప్రత్యేక విభాగాన్ని నియమించింది. పలువురు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు. పార్టీ ఏర్పాటు తర్వాత జనసేన ఎదుర్కొబోయే మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కావడం విశేషం.
పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీమతి నల్లమోతు భారతి గారు నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి గారు జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆమెను అభినందించారు pic.twitter.com/GrtrS55H75
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




