బోటు ప్రమాదం : ఏడు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా..

బోటు ప్రమాదం : ఏడు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా..
x
Highlights

కచ్చులూరు గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును ఒడ్డుకు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బోటులో ఐదు, నదిలో రెండు.. మొత్తం ఏడు మృతదేహాలను...

కచ్చులూరు గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును ఒడ్డుకు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బోటులో ఐదు, నదిలో రెండు.. మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకోసం రెండు అంబులెన్స్‌లు ఉపయోగించి రాత్రి 8.45 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో మృతదేహాలను మార్చరీలో భద్రపరిచారు.

మృతదేహాలకు డిఎన్ఏ టెస్టు చేసిన తరువాతే మృతుల కుటుంబాలకు సమాచారం అందిస్తారు. ఇప్పటికే కొన్నింటికి డిఎన్ఏ టెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాత మృతదేహాలను వారికి అప్పగించనున్నారు. మృతదేహాలు బోటులోని ఒక రూమ్‌లో ఉండిపోవడంతో తీవ్రంగా కుళ్లిపోయాయి. ఇంకా లభించాల్సిన ఐదు మృతదేహాలు కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారని తెలిపారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద సెప్టెంబర్‌ 15వ తేదీన గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం అతి కష్టం మీద బోటును మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒడ్డుకు తరలించింది. విశాఖకు చెందిన ఓం శివశక్తి సాయి అండర్‌ వాటర్‌ సర్వీస్‌కు చెందిన పది మంది డీప్‌ డైవర్స్‌ కూడా ధర్మాడి బృందంతో కలసి పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories