ఏపీలో నూతనంగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు సిద్ధం

ఏపీలో నూతనంగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు సిద్ధం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా 60 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా 60 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్పొరేషన్లపై సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.. అందుకు తగ్గట్టుగానే బీసీ సంక్షేమ శాఖ ప్లాన్‌ 'ఏ' కింద 16, ప్లాన్‌ 'బీ' కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే ఓసీ లైన రెడ్డి, కమ్మ, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్‌ ప్రతిపాదించినట్టు సమాచారం.

కాగా ఈ నెల 1న ముఖ్యమంత్రితో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉంది.. అయితే రాష్ట్ర అవతరణ వేడుకల సందర్బంగా వాయిదా పడింది.దీంతో త్వరలో జరగబోయే సమీక్షలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బీసీ–ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ–బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ–సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ–డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు, బీసీ–ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30 కార్పొరేషన్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories