పీటీసీలో ట్రైనింగ్ కు 524 మంది పోలీసులు

పీటీసీలో ట్రైనింగ్ కు 524 మంది పోలీసులు
x
పిటిసి ప్రిన్సిపల్ సూర్య భాస్కర్ రెడ్డి
Highlights

మండలం కళ్యాణీ డ్యాం సమీపంలోని పోలీస్ శిక్ణణ కేంద్రానికి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రిక్యూట్ అయిన 524 మంది పోలీసులు శిక్షణ పొందేందుకు వస్తున్నారు.

చంద్రగిరి: మండలం కళ్యాణీ డ్యాం సమీపంలోని పోలీస్ శిక్ణణ కేంద్రానికి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రిక్యూట్ అయిన 524 మంది పోలీసులు శిక్షణ పొందేందుకు వస్తున్నారు. బుధవారం 300 మందికి పైగా రిక్యూట్ అయిన పోలీసులు శిక్షణ కోసం పి టి సి లో రిపోర్ట్ చేసుకున్నారు. వీరికి పిటిసి ప్రిన్సిపల్ సూర్య భాస్కర్ రెడ్డి వీరందరికీ ప్రవేశం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉత్తీర్ణులైన వారిలో 524 మంది కానిస్టేబుల్స్ ( సివిల్స్) కళ్యాణి డామ్ పోలీసు శిక్షణా కళాశాల నందు ట్రైనింగ్ తీసుకోనున్నారని , వీరిలో ప్రకాశం జిల్లా నుండి 62 మంది , నెల్లూరు నుండి 134 మంది , కర్నూల్ నుండి 105 మంది , అనంతపురం నుంచి 46 మంది, కడప నుంచి 60 మంది , విశాఖపట్నం నుంచి 8 మంది, విశాఖపట్నం అర్బన్ నుంచి 54 మంది, విజయనగరం నుంచి 55 మంది రావలసి ఉండగా ఇప్పటివరకు 331 మంది మాత్రమే రిపోర్ట్ చేసుకున్నారన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories