Top
logo

CM జగన్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగో తరగతి చిన్నారి లేఖ

CM జగన్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగో తరగతి చిన్నారి లేఖ
Highlights

ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్‌కి ఓ లేఖ రాసింది. తమ...

ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్‌కి ఓ లేఖ రాసింది. తమ ప్రాంతంలో జరుగుతున్న గొడవల కారణంగా తన చదువుకు ఆటంకం కలుగుతుందని కోడూరి పుష్ప అనే చిన్నారి ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబం నాలుగు నెలలుగా బహిష్కరణను ఎదుర్కొంటుందని...చిన్నారి ఫిర్యాదు చేసింది. తన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎంను కోరింది.

తన తండ్రి కోడూరి వెంకటేశ్వర్లుపై నిత్యం దాడులు జరుగుతున్నాయని, కొందరు వ్యక్తులు తన తండ్రిని వేధింపులకు గురిచేస్తున్నారని సీఎంకి రాసిన లేఖలో వివరించింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆ చిన్నారి తన లేఖ ద్వారా ముఖ్యమంత్రికి వివరించింది. వెలివేసిన తమ కుటుంబాన్ని గ్రామంలో జీవించే హక్కును కల్పించాలని ముఖ్యమంత్రిని కోరింది.


లైవ్ టీవి


Share it
Top