Regional development zones: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

Regional development zones: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
x
cm jagan
Highlights

Regional development zones: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హాయాంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ మండళ్లు మాదిరిగానే ఏపీలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Regional development zones: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హాయాంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ మండళ్లు మాదిరిగానే ఏపీలో నాలుగు జోన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై గతంలోనే వార్తలు రాగా, ప్రస్తుతం వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని భావిస్తున్నారు. దీనిపై ఇవాళ మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు.

రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి.. వాటికి చైర్మన్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే ముందే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రా, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.

★విజయనగరం జోన్:-

దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి.

1.విశాఖ,

2.శ్రీకాకుళం,

3.విజయనగరం

★కాకినాడ జోన్:-

దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి.

1.తూర్పు గోదావరి

2.పశ్చిమగోదావరి

3.కృష్ణా

★గుంటూరు జోన్:-

దీని పరిధిలోకిమూడు జిల్లాలు వస్తాయి.

1.నెల్లూరు

2.ప్రకాశం

3.గుంటూరు

★కడప జోన్:-

ఈ జోన్ పరిధిలో సీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి.

1.చిత్తూరు

2.కర్నూలు

3.అనంతపురం

4.కడప

ఒక్కో జోన్ కు ఒక్కో ప్రత్యేకత..

రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల దృష్ట్యా వేర్వేరు వ్యూహాలను జగన్ సర్కారు సిద్దం చేస్తున్నది.

విజయనగరం జోన్:-

పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

_శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.

_కాకినాడ జోన్ లో -

ఆక్వా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడతారు. గుంటూరు జోన్

పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇస్తారు. కడప జోన్ లో

హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

జోన్ల చైర్మన్లకు మంత్రి హోదా..

ఏపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు రీజనల్ డెవలప్మెంట్ జోన్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ రూపొందించబోతున్నట్లు సమాచారం. బోర్డు పరిధిలో చైర్మన్ తోపాటు ఏడుగురు సభ్యులు ఉండేలా కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని తెలుస్తోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం అధికార వైసీపీ నేతల్లోని ఆశావాహులకు తీపి కబురులా మారింది. మంత్రి పదవులు ఆశించి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలు ఈ పదవుల కోసం పోటీపడే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories