వైసీపీకి షాక్.. రేపు టీడీపీలో చేరనున్న ముగ్గురు కీలకనేతలు

వైసీపీకి షాక్.. రేపు టీడీపీలో చేరనున్న ముగ్గురు కీలకనేతలు
x
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. గత ఎన్నికల్లో...

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ మాజీ కోఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంపర రమేష్, పలకా సూర్యకుమారి తెలుగుదేశంలో చేరనున్నారు. ఈ సందర్బంగా సునీల్ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైయస్ జగన్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు తనను పిలిచి 'నీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని' గౌరవంగా పిలిస్తే.. టీడీపీ చేరాలని తాము నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories