Drugs: విశాఖ పోర్టులో డ్రగ్స్‌ కలకలం.. 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం

25 Thousand Kgs Of Drugs Seized In Visakhapatnam
x

Drugs: విశాఖ పోర్టులో డ్రగ్స్‌ కలకలం.. 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం

Highlights

Drugs: బ్రెజిల్‌ నుంచి కంటైనర్‌లో పోర్టుకు డ్రగ్స్‌

Drugs: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి కంటైనర్ లో విశాఖ పోర్టుకు డ్రగ్స్ సరఫరా అయ్యాయి. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 25 వేల కిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నల్లమందు. మార్పిన్ , కొకైన్,హెరాయిన్, మాఫటెమిన్, మెస్కలిన్ ఉన్నట్టు గుర్తించారు. సంద్యా ఆక్వాఎక్స్ పోర్టుపై కేసు నమోదు చేశారు.

అయితే సంద్యాఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. బ్రెజిల్ కు చెందిన ఓ కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే పదార్థాన్నే తాము ఆర్డర్ చేశామని సంద్యాఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ చెబుతోంది కంటైనర్ బ్రెజిల్ నుంచి ఈనెల 16న విశాఖ పోర్టుకు చేరుకుంది. అయితే, కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నట్టు ఇంటర్ పోల్ నుంచి సమాచారం రావడంతో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు నిర్దారణ అయింది. అయితే ఇవి డ్రగ్స్ కాదని రొయ్యల మేతలో వినియోగించే పదార్థాలేనని సంద్యాఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ చెబుతోంది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామంటోంది.

మరోవైపు డ్రగ్స్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల తరుణంలో అధికార వైసీపీయే ఈ డ్రగ్స్ ను తీసుకుంచ్చిందని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. సంద్యాఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ టీడీపీకి దగ్గరని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తమకు ఏపార్టీతోనూ సంబంధాలు లేవని సంద్యాఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ చెబుతోంది.ఈసంస్థపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కంపెనీని గతంలో సీజ్ చేసినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories