ఏపీలో 21 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, మరో 7 లక్షల..

ఏపీలో  21 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, మరో 7 లక్షల..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళు, గృహనిర్మాణ స్థలాలకు 28 లక్షల మంది అర్హులు అని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 21 లక్షల మంది లబ్ధిదారులు ఇంటి పట్టాలకు అర్హులు కాగా...

ఆంధ్రప్రదేశ్ ఇళ్ళు, గృహనిర్మాణ స్థలాలకు 28 లక్షల మంది అర్హులు అని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 21 లక్షల మంది లబ్ధిదారులు ఇంటి పట్టాలకు అర్హులు కాగా 7 లక్షల మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి అర్హులని తేల్చింది. వాలంటీర్లు గ్రామ కార్యదర్శుల సహాయంతో ఈ జాబితాను రూపొందించింది. శుక్రవారం విలేకరుల సమావేశంలో గృహనిర్మాణ మంత్రి సి శ్రీ రంగనాథ రాజు మాట్లాడుతూ.. మార్చి 31, 2020 లోపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 12 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారని అన్నారు.

కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (సిఎస్‌ఎంసి) ద్వారా రాష్ట్రానికి 3,75,225 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 7,53,527 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మంజూరు చేసిన గృహాలలో ఇది అత్యధికం అని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 11,302 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ .4,742 కోట్లు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో భూసేకరణ, భూమిని చదును చేసే పనులు జరుగుతున్నాయి.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కింద సుమారు 28 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం జనవరిలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ .50 వేల కోట్ల నుంచి రూ .70 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో సుమారు రూ .2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని మంత్రి చెప్పారు. కాగా ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ సంకల్పించారు. గ్రామాల్లో దాదాపు భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ఆ జాబితాను గ్రామ సచివాలయాల వద్ద ఉంచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories