15న అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ‘ఈ – లాటరీ’

15న అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ‘ఈ – లాటరీ’
x
Highlights

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి ఈ నెల 15న ‘ఈ – లాటరీ’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి ఈ నెల 15న ‘ఈ – లాటరీ’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమీకరణ పథకంలో ఏపీ సీఆర్డీఏ వారికి 9.14 కింద ఇటీవల భూములు అందజేసిన పలు గ్రామాల రైతులకు ఈ – లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. అలాగే, N17 రహదారి నిర్మాణానికి తీసుకున్న అనంతవరం మినహాయింపు భూమికి సంబంధించిన 24 మంది రైతులకు, మల్కాపురం – సర్వే నంబర్ 18లో మినహాయింపు భూమికి చెందిన ఇద్దరికి, మల్కాపురం – అనధికార లేఅవుట్ వల్ల 65-35 శాతం కింద ఏడుగురు రైతులకు కూడా ఈ – లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు.

కృష్ణాయపాలెం, నవులూరు 1 & 2, కురగల్లు 1 & 2, వెలగపూడి, మందడం 1 & 2, నిడమర్రు 1 & 2 గ్రామాల రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే పెనుమాక, తుళ్లూరు 1 & 2, నెక్కల్లు, అనంతవరం, రాయపూడి 1 & 2, వెంకటపాలెం, దొండపాడు, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, అనంతవరం, మల్కాపురం గ్రామాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్లాట్లకు 4 గంటల నుంచి 5 గంటల వరకు రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ - లాటరీ జరుగుతుంది. ఈ - లాటరీలో భాగంగా 225 మంది రైతులకు మొత్తంగా 405 ప్లాట్లను ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా కేటాయిస్తారు. వీటిలో 264 ప్లాట్లు 9.14 కింద భూములు అందజేసిన రైతులకు కేటాయిస్తారు. మిగిలిన 108 ప్లాట్లు ప్రత్యామ్నాయ ప్లాట్లు. సంబంధిత రైతులు ఈ- లాటరీ కార్యక్రమానికి హాజరై సంబంధిత ప్రొవిజనల్ సర్టిఫికెట్లను తీసుకోవాలని సీఆర్డీఏ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories