కృష్ణా జిల్లాలో 15 థియేటర్‌లు సీజ్.. అన్ని థియేటర్‌లకు ఫిక్స్‌డ్ రేట్లు

Krishna - Theatres: జీవో 35 కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లపై అధికారుల దృష్టి...

Shireesha
Updated on: 22 Dec 2021 3:18 PM IST
!5 Theatres Seized in Krishna District due to High Ticket Rates and Breaking Covid Protocols
X

కృష్ణా జిల్లాలో 15 థియేటర్‌లు సీజ్.. అన్ని థియేటర్‌లకు ఫిక్స్‌డ్ రేట్లు

Krishna - Theatres: కృష్ణా జిల్లాలో 15 థియేటర్‌లు సీజ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్‌లను మూసివేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్‌లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారా అంటూ సోదాలు చేస్తున్నారు.

టికెట్ రేట్ల కంటే తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీప్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్‌లకు ఫిక్స్‌డ్ రేట్లు విధించనున్నారు. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్లపై అధికారుల దృష్టి సారించారు.

Shireesha

Shireesha

Next Story