పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

146th Birth Anniversary Celebrations of Pingali Venkayya
x

పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

Highlights

Pingali Venkayya Jayanthi: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Pingali Venkayya Jayanthi: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories