ఇవాళ 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం

ఇవాళ 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం
x
VasiReddy File Photo
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12 దిశ పోలీసు స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12 దిశ పోలీసు స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. శనివారం విశాఖలో పర్యటించింన ఆమె మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలో మహిళా న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకా అమలు చేస్తుందని, రాష్ట్రంలో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అని అన్నారు. చిత్తూరులో చిన్నారి హర్షిత హత్య కేసులో మహిళా కమిషన్‌ చొరవ తీసుకొని పోక్సో చట్టం కింద నిందితుడికి శిక్షపడేలా చేసిందన్నారు.

చిత్తూర్ జిల్లాలో పొక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 7న చిన్నారి హర్షితపై హత్యాచారం కేసు లో మొహ్మద్ రఫీకి మొదటి అదనపు కోర్ట్ దోషిగా నిర్దారించి అతడికి మరణ శిక్ష విధించింది. అతనిని ఎప్పుడు ఉరి తీయాలన్నది హై కోర్ట్ నిర్ణయిస్తుంది అని న్యాయమూర్తి తెలిపారు. ఏపీలో పొక్సో చట్టం కింద ఉరిశిక్ష పడ్డ తొలి కేసు కావడం విశేషం.

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'దిశ' విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ చట్టం ద్వారా అత్యాచార కేసుల్లో 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి దోషులకు శిక్ష అమలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. దిశ యాప్ కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories