కుక్కల దాడిలో 11 మేకలు మృతి

కుక్కల దాడిలో 11 మేకలు మృతి
x
Highlights

విజయనగరం జిల్లాలో ఘోరమైన సంఘటన జరిగింది. 11 మేకలును కొరికి చంపాయి కుక్కలు. అంతేకాదు మరో డజను మేకలు ప్రాణాలతో పోరాడుతున్నాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా...

విజయనగరం జిల్లాలో ఘోరమైన సంఘటన జరిగింది. 11 మేకలును కొరికి చంపాయి కుక్కలు. అంతేకాదు మరో డజను మేకలు ప్రాణాలతో పోరాడుతున్నాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కొట్టు గ్రామానికి చెందిన పి.సన్యాసి గొర్రెల కాపరి. అతనికి సుమారు 50 మేకలు, గొర్రెలు ఉన్నాయి. గురువారం రాత్రి వాటిని ఒక షెడ్‌లో ఉంచి ఇంట్లో నిద్రపోయాడు.

అయితే అర్ధరాత్రి కొన్ని వీధి కుక్కలు షెడ్‌లోకి ప్రవేశించి 11 మేకలను కొరికి చంపాయి. మరో 12 మేకలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని సన్యాసి వాపోయాడు. తనకు సహాయం చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాడు. చనిపోయిన మేకల మాంసాన్ని ఎవరూ కొనలేదని.. దాంతో వాటిని పూడ్చిపెట్టినట్టు చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories