Jagan: సీఎం జగన్ హిట్ లిస్ట్‌లో 10 మంది ఎమ్మెల్యేలు

10 MLAs In CM Jagan Hit List
x

Jagan: సీఎం జగన్ హిట్ లిస్ట్‌లో 10 మంది ఎమ్మెల్యేలు

Highlights

Jagan: రాపాక వరప్రసాద్ రాజోల్ టు అమలాపురం ఎంపీ

Jagan: అభ్యర్థుల మార్పు విషయంలో తగ్గేదేలే అంటున్నారు సీఎం జగన్. ఎంతటి వారైనా.. తనకు ఎంత సన్నిహితంగా ఉన్న.. ప్రజాధరణ లేకపోతే.. టికెట్లు ఇచ్చేదేలే అని తేల్చి చెప్పేస్తున్నారు. ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు..? ఎవరిని స్థానంచలనం చేయించాలన్న దానిపై సీఎం జగన్ ఇప్పటికే ఓ హిట్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రిపేర్ చేసిన ఆ హిట్ లిస్ట్‌లో ఇప్పటికే ఓ 10 మంది ఎమ్మెల్యేలు చేరినట్లు వైసీపీలో టాక్ నడుస్తోంది.

10 ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్లు నిరాకరించారని.. వారి సేవలను పార్టీ కోసం వాడుకుంటామని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. మరికొందరు నేతలను స్థానచలనం చేయించకపోతే ఆయా నియోజకవర్గాలను వదులుకోవాల్సి వస్తుందని క్షేత్ర స్థాయి సర్వేల ఆధారంగా గుర్తించిన జగన్ వారిని.. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories