అధికారులపై సీఎం సీరియస్.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

అధికారులపై సీఎం సీరియస్.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
x
Highlights

అధికారులపై సీఎం సీరియస్.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులపై సీఎం సీరియస్.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఎంపీడీఓను దూషించిన కేసులు నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ అధికారులపై మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. అయితే తన అరెస్టుపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపధం చేశారు. తాను MPDO ఇంటికి వెళ్లాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కాగా కోటంరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories