బీజేపీ నేత రాంమాధవ్ తో గంటా శ్రీనివాసరావు భేటీ.. నిజమేనా!

బీజేపీ నేత రాంమాధవ్ తో గంటా శ్రీనివాసరావు భేటీ.. నిజమేనా!
x
Highlights

ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది కీలక నేతలు బీజేపీ, వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, చీరాల...

ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది కీలక నేతలు బీజేపీ, వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఓ ఫోటో టీడీపీ శ్రేణులను నివ్వెరపాటుకు గురిచేస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీ అగ్రనేత రామమాధవ్ తో సమావేశం అయినట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. గంటా వర్గం కూడా ఈ ఫోటోపై క్లారిటీ ఇవ్వకపోవడం ఇందుకు బలం చేకూరినట్టయింది. విశాఖ నార్త్ నియోజకవర్గంనుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు గంటా. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా చేరికకు అడ్డుచెప్పడంతో కుదరలేదు. ఈ క్రమంలో గంటా బీజేపీలో చేరతారని భావిస్తున్న తరుణంలో ఈ ఫోటో బయటికి రావడంతో చర్చనీయాంస్యమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories