రోజాను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది శివప్రసాదే..

రోజాను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది శివప్రసాదే..
x
Highlights

రోజాను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది శివప్రసాదే.. రోజాను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది శివప్రసాదే..

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 11 జూలై 1951న నాగయ్య, చెంగమ్మ దంపతులకు శివప్రసాద్ జన్మించారు. తిరుపతి ఆయన స్వగ్రామం. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, శివప్రసాద్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వైసీపీ నాయకురాలు పద్మజారెడ్డి స్వయానా ఆయన సోదరి. పిబ్రవరి26, 1972 లో రాజ్యలక్ష్మిని ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాహిత్యము, కళలు, సినిమా నటన వంటి అంశాలపై శివప్రసాద్ కు మక్కవ ఎక్కువ.మొదట సినీ రంగంనుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు శివప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'మాస్టారి కాపురం' సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 1990 సినిమాల్లో నటిస్తూనే తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. టీడీపీలో రోజా చేరికకు శివప్రసాద్ ముఖ్య పాత్ర వహించారు. అయితే టికెట్ విషయంలో శివప్రసాద్ తో విభేదించారు రోజా. 2009 లో మొదటిసారి చిత్తూరు ఎంపీగా విజయం సాధించారు శివప్రసాద్. ఆ తరువాత 2014 లో మరోసారి చిత్తూరు ఎంపీగా గెలిచి.. తాజాగా జరిగిన ఎన్నికల్లో రెడ్డెప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకానొక దశలో శివప్రసాద్ ఉన్నంతకాలం చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఆయనే అని చంద్రబాబు అప్పట్లో అన్నారు. వారిద్దరి మధ్య అతంటి సాన్నిహిత్యం ఉండేది. స్వతహాగా కళాకారుడైన శివ ప్రసాద్‌.. ఏ వేషం వేసుకున్నా అందులో ఒదిగిపోయేవారు. వేషధారణకు తగ్గట్టే తన భాషను కూడా మార్చుకునే వారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories