ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్

ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్
x
Highlights

ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్ ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్

తాడేపల్లిగూడెంలో మహానటుడు ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిరు పర్యటన నేపథ్యంలో 120 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొదటగా సుమారు 250కిపైగా కార్లతో ర్యాలీగా తాడేపల్లిగూడెం వెళ్లిన చిరు.. మార్గ మధ్యంలో అక్కడక్కడా అభివాదం చేస్తూ.. ముందుకు వెళ్లారు. విగ్రహావిష్కరణ తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మెగాస్టార్ మాట్లాడతారు. దాదాపు 45 నిమిషాల పాటు చిరంజీవి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి గూడెం, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంతకుమార్, ఈలి నాని పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories