పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాగుంట

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాగుంట
x
Highlights

ఒంగోలు మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీ మారుతారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలో...

ఒంగోలు మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీ మారుతారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రూమర్లను ఖండించారు మాగుంట.. తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. వచ్చే ఎన్నికలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాగుంట స్పష్టం చేశారు. కాగా ఎంపీగా పోటీ చెయ్యాలంటే మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు తాను సూచించిన నేతలనే పెట్టాలని మాగుంట పెట్టిన కండిషన్ కు చంద్రబాబు ఒకే చెప్పారు. దాంతో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో మాగుంట తనకు అనుకూలమైన అభ్యర్థులను తయారుచేసుకునే పనిలో పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories