ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..
x
Highlights

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని...

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా ఇద్దరు నామినేషన్ అనంతరం బయటికి వచ్చారు.

దీంతో ముందుగా వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు కేఏ పాల్ ను పరిచయం చేసుకున్నారు. దానికి కేఏ పాల్ మై డియర్ బ్రదర్ నాకు తెలుసు. నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడు అని అక్కడున్న రిపోర్టర్లతో అన్నాడు పాల్. అంతేకాదు రఘురామకృష్ణంరాజు ఓటు, ఆయన తల్లీ, చెల్లి, భార్య అందరి ఓటు నాకే పడుతుందని అన్నాడు. దానికి రిప్లై ఇచ్చిన రఘురామకృష్ణంరాజు గెలుపుపై ఎవరి ధీమా వారిది. అని సింపుల్ గా ముగించేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories