Top
logo

ఒకే జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, చంద్రబాబు..

ఒకే జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, చంద్రబాబు..
Highlights

ఒకే జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, చంద్రబాబు.. ఒకే జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, చంద్రబాబు..

అధికార ప్రతిపక్షాల బలాబలాలకు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరు జిల్లాకు వస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 15న సీఎం జగన్ నెల్లూరు వస్తున్నారు. అదేవిధంగా సమీక్షల పేరుతో చంద్రబాబు కూడా అంతకుముందు రోజే జిల్లాకు చేరుకోనున్నారు. దీంతో ఇద్దరి భద్రత పోలీసులకు సవాల్ గా మారింది. వీరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి ఊపుమీదున్న వైసీపీ నేతలు సీఎం సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు లక్షమందికి పైగా సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించేందుకు వస్తున్న చంద్రబాబు సభలను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనను ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పర్యటనలతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.

Next Story