logo

పెళ్లి మండపంలో బాంబ్ పెట్టినట్టు ఫోన్ కాల్.. చివరకు..

పెళ్లి మండపంలో బాంబ్ పెట్టినట్టు ఫోన్ కాల్.. చివరకు..
Highlights

చిత్తూరు జిల్లాలో బాంబ్ కలకలం రేగింది. పెళ్లి వేడుక జరుగుతుండగా సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బంధువులంతా...

చిత్తూరు జిల్లాలో బాంబ్ కలకలం రేగింది. పెళ్లి వేడుక జరుగుతుండగా సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బంధువులంతా ఎక్కడికక్కడ పరుగులు తీశారు. సత్యవేడు విఎంకే కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండపంలో గురువారం మాజీ ఎంపీపీ మస్తాన్‌ పెళ్లి జరుగుతోంది. అయితే హఠాత్తుగా మండపంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు కాల్ వెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ను తీసుకొని మండపానికి వచ్చారు. దాంతో గందరగోళం నెలకొంది. ఈ విషయం మొత్తం పాకింది.. దాంతో బంధువులంతా పరుగులు తీశారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలించగా బాంబు కనిపించలేదు. ఓ వైపు స్వాతంత్ర్యదినోత్స వేడుకలు జరుగుతున్న సమయంలో బాంబు పెట్టినట్టు కాల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎవరైనా విద్రోహులు దాడులకు పాల్పడబోతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంతో సత్యవేడు ఉలిక్కిపడింది.


లైవ్ టీవి


Share it
Top