బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యం

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యం
x
Highlights

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యమైంది.. ఏడు రోజుల క్రితం హైయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన సోని.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవిశంకర్...

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యమైంది.. ఏడు రోజుల క్రితం హైయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన సోని.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవిశంకర్ వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. అద్దంకి నుంచి సొనీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈనెల 23న కిడ్నాప్ అయింది సోని. యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రవి శేఖర్ కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. కిడ్నాపర్ రవి శేఖర్ కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద నిందితుడి చివరి సిగ్నల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా కిడ్నాపర్ ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రూపాయలు పారితోషికం ఇస్తామంటూ పోలీసులు ప్రకటించారు. అయితే రవి శేఖర్‌ ‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న సోని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories