కర్నూలులో హై కోర్టు ఎక్కడ ఏర్పాటు అవుతుంది ?

కర్నూలులో హై కోర్టు ఎక్కడ ఏర్పాటు అవుతుంది ?
x
Highlights

కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నాటికి జ్యూడిషియల్ క్యాపిటల్ కొలువు తీరుతుందని భావిస్తున్నారు. అయితే, కర్నూలులో హై కోర్టు...

కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నాటికి జ్యూడిషియల్ క్యాపిటల్ కొలువు తీరుతుందని భావిస్తున్నారు. అయితే, కర్నూలులో హై కోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, జడ్జీల క్వార్టర్స్ ఎక్కడ వుంటాయి అనేదానిపై స్థానికుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక్కో వ్యక్తి ఒకో చోటు చెబుతున్నారు. నిజంగా కర్నూలులో ఏ ప్రదేశాలు రాజధానికి అనుకూలంగా వున్నాయి ?

మూడు రాజధానుల నిర్ణయానికి ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. శాసన రాజధానిగా అమరావతి..పరిపాలనా రాజధానిగా విశాఖ..న్యాయ రాజధానిగా కర్నూలును ఖరారు చేసింది. హై కోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది ఇప్పుడు కర్నూలులో హాట్ టాపిక్ గా మారింది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. కర్నూలు శివారులోని ఓర్వకల్లు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. భారీ భవనాలు లేకపోవడంతో ఓర్వకల్లులో హై కోర్టు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.

మునగాలపాడు సమీపంలోని బాలా సాయిబాబా ఆశ్రమం వుంది. బెంగళూర్ - హైదరాబాద్ సమీపంలోని ఈ ఆశ్రమంలో గతంలో ఇంటర్ నేషనల్ స్కూల్ నడచింది. బాల సాయిబాబా మరణం తర్వాత స్కూల్ మూతపడింది. వెంటనే హై కోర్టు ఏర్పాటు చేయాల్సివస్తే బాల సాయిబాబా ఆశ్రమంగా అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

కర్నూలు సమీపంలోని ఏపీఎస్పీ 11 వ బెటాలియన్ లో హై కోర్టు ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. 11వ బెటాలియన్ లో 150 ఎకరాల స్థలం ఉంది. జడ్జీల క్వార్టర్స్ , సిబ్బంది నివాసాలు ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎస్పీ 11 వ బెటాలియన్ జగన్నాథ గట్టు ప్రాంతంలో తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలులో ఏ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసినా భూముల ధరలు పెరగడం మాత్రం ఖాయమని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories