చెత్త నుంచి సంపద సృష్టి

చెత్త నుంచి సంపద సృష్టి
x
శానిటేషన్ అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో వార్డుల్లో ప్రత్యేక శిక్షణ
Highlights

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

తుని: పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయాన్నే వార్డుల్లో పర్యటించి చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో వార్డుల్లో నే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వార్డుల్లో సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్త ను అక్కడే వేరు చేసి తోపుడు రిక్షా లో ఏర్పాటుచేసిన వేరు వేరు డస్ట్ బిన్ లో వేస్తున్నారు.

చెత్తను సేకరించి ట్రాక్టర్లో తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ లో వేయడం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు మున్సిపాలిటీలు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసే రైతులకు అందజేస్తున్నారు. పొడి చెత్తను కూడా వాటిని ఉపయోగించుకునే కర్మాగారాలకు విక్రయిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పట్టణంలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ఆన్ సైట్ కంపోస్టింగ్ ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసి వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నారు. తుని మున్సిపాలిటీ లో పైలెట్ ప్రాజెక్ట్ గా బ్యాంక్ కాలనీ ఎంపిక చేస్తామని, మున్సిపాలిటీలో అన్ని వాటిల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories