నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు...

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదడంతోపాటు, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Update: 2020-05-21 07:12 GMT

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదడంతోపాటు, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుపాను ఉంఫాన్ తీవ్రతకు వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారిణి రత్న తెలిపారు. మే 24 తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతయాని ఆయన వెల్లడించారు.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉంఫాన్ బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉందని, రానున్న మూడు గంటల్లో అది బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర తుఫాన్ ఉంఫన్‌ మరింతగా బలపడి తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీలో కుడా వర్షాలు కురిసాయి.  

Tags:    

Similar News