కరోనా పేరుతో ఏప్రిల్ ఫూల్ చేస్తే జైలు శిక్ష

ఏప్రిల్ 1వ తేది వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఫూల్స్ చేస్తూ ఉంటారు.

Update: 2020-04-01 07:20 GMT
Representational Images

ఏప్రిల్ 1వ తేది వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఫూల్స్ చేస్తూ ఉంటారు. లేని వాటిని ఉందని ఎదుటి వారికి చెప్పి నమ్మించి వారు చూసాక ఏప్రిల్ ఫూల్ అయ్యావు అంటూ నవ్వుకుంటారు. కానీ ఈ ఏడాది ఆలోచించి జోకులు వేయాలని చెపుతున్నారు పోలీసు అధికారులు. ఎవరైనా కరోనా వైరస్‌ పేరుతో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తే జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనిపై మంగళవారం మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఓ ప్రకటనను విడుదల చేసారు.

ఏప్రిల్‌ ఫూల్‌ పేరుతో తప్పుడు సమాచారాన్ని ఎవరైనా షేర్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి ఉండడంతో ఆలయంలో ఎవరూ జరుపుకోకూడదని, భక్తులు ఇండ్లకే పరిమితమై ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలని జయశంకర్‌ భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ వీ శ్రీనివాసులు ప్రజలకు తెలిపారు. ఎవరూ కూడా గుంపులు గుంపులుగా ఉండి ప్రార్థనలు చేయకూడదని హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉందని, ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు విస్మరించి బయటికి వెలితే వారిపై కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, ఉన్నతాధికారులు హెచ్చరించారు.

ఇక తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 97కు చేరింది. మంగళవారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కోవిడ్ సోకిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతానికి 77 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే ఈ వ్యాదిన పది ఆరుగురు చనిపోయారు.

Tags:    

Similar News