మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువ అని పేర్కొన్నారు.

Update: 2019-09-05 03:17 GMT

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువ అని పేర్కొన్నారు. ఇక ఆంధ్రలోనూ.. 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేశారు. 

Tags:    

Similar News