కేసీఆర్‌ అనే పేరుకు కొత్త నిర్వచనమిచ్చిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయడానికి సీఎం కేసీఆర్ ముందడుగు వేసారు.

Update: 2020-05-29 09:30 GMT
CM KCR(File photo)

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయడానికి సీఎం కేసీఆర్ ముందడుగు వేసారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ కు అనే పేరుకు కొత్త నిర్వచనమిచ్చారు. ఈ నిర్వచనాన్ని ఆయన ట్విటర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను తరలించడంతో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని, అందుకే కేసీఆర్‌ పేరు సార్థకమైందన్నారు‌. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం కేవలం మూడు సంవత్సరాలలోనే పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు కేశావపురం రిజర్వాయర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కేటీఆర్‌. దూరదృష్టితో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.




 


Tags:    

Similar News