అందరినీ ఆకర్షిస్తున్న 'తెలంగాణ కళా జాతర'

తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు, సంస్కృతిక కళలకు పెట్టింది పేరుగా నిలిచిన రాష్ట్రం.

Update: 2020-02-14 09:53 GMT

తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు, సంస్కృతిక కళలకు పెట్టింది పేరుగా నిలిచిన రాష్ట్రం. రాష్ట్రంలోని జిల్లాలలో ప్రదర్శించే లంబాడీ, గుస్సాడీ, బుర్రకథ, చెక్క భజన, చిందు బాగోతం, చిరుతల కోలాటం, మృదంగం, ఒగ్గు కథ, ఒగ్గు డోలు, కత్తుల నృత్యం, కొమ్మ బూరలు, పగటివేషాలు, పెద్దమ్మ లోల్లు, పులి వేషాలు, చెక్క బొమ్మలాట, పెర్ని శివతాండవం, సాధనశూరులు, లంబాడి బిందెల నృత్యాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కళలను సమాజంలో అందరికీ తెలియజేసి, కళలకు మరింత ప్రాచూర్యం కల్పించడంతోపాటు కళాకారులకు చక్కటి వేదికనందించేందుకు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో 'తెలంగాణ కళా జాతర' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణ కళలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన పురాతన కళలను కళాకారులు ప్రదర్శించిన తీరు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక పోతే మూడు రోజులపాటు కొనసాగే కళా జాతరలో 33 జిల్లాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. వీరంతా వారి వారి జిల్లాలకు చెందిన కళలను 33 గంటలపాటు ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగానే మొదటి రోజు జాతర ఎంతో విజయవతంగా కొనసాగగా, జాతర రెండో రోజున సంగీత విభావరితోపాటు బుల్లితెర కమెడియన్లు తమ కామెడీతో సం దర్శకులను ఎంతగానో నవ్వించారు. అంతే కాక రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన పలు కళలను ప్రదర్శించిన తీరు ఎంత గానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర కళలు, కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. పురాతన కాలం నుంచి వస్తున్న కళలకు ప్రజలు విస్మరించకుండా ఉండాలని కోరారు. 

Tags:    

Similar News