రాష్ట్రంలో మరో 49 కరోనా కేసులు : మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Update: 2020-04-08 16:22 GMT
Etela Rajendar(file photo)

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితిపై బుధవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నమోదయిన కేసుతో చూసుకుంటే పాజిటివ్‌ కేసుల సంఖ్య 453కు చేరిందన్నారు. వాటితో 397కేసులు యాక్టివ్‌ పాజిటివ్‌ గా ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సాధారణ చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. బాధితుల్లో ఎవరూ కూడా ఐసీయూ, వెంటిలేటర్లల్లో లేరన్నారు.

కరోనా వచ్చిన వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నామని, జిల్లాల్లో ఎవరూ లేరని ఆయన అన్నారు. ఇక కరోనా అనుమాతులని క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు చేయిస్తున్నామని పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ కు, నెగటివ్‌ వస్తే జిల్లాల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఇటీవలే గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మందుల కొరత లేదని ఆయన స్పష్టం చేసారు. 5 లక్షల పీపీఈ కిట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని, ప్రస్తుతం 80 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనాపై సీఎం కేసీఆర్‌ ప్రతిరోజు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News