Coronavirus: తెలంగాణలో తొలి కరోనా మరణం...

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఓ వ్యక్తి ప్రాణాలకు వదిలాడు.

Update: 2020-03-28 13:45 GMT
Representational Image

తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఓ వ్యక్తి ప్రాణాలకు వదిలాడు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని కానీ అతను చనిపోయిన తరువాత రిపోర్టులు వచ్చయన్నారు. అయితే మరణించిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణలో తెలిందన్నారు.

మరోవైపు తెలంగాణలో ఈరోజు మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేసారు. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 65కు చేరిందన్నారు. హైదరాబాద్ పాతబస్తీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, కుత్బుల్లాపూర్, నాంపల్లికి చెందిన నాలుగు కుటుంబాలకు కరోనా వ్యాపించిందని ఆయన తెలిపారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ కుటుంబంలో నలుగురికి, పాతబస్తీకి చెందిన ఓ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకిందని ఈటల తెలిపారు. అంతే కాక విమానాశ్రయంలో పనిచేస్తున్నవారిలో కూడా కొందరికి కరోనా వచ్చినట్టు ఆయన తెలిపారు.


Tags:    

Similar News