జూన్ 12కి బడిగంట మోగేనా?

కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు వేసవి రాకముందునుంచే సెలవులు ప్రకటించారు.

Update: 2020-05-05 08:56 GMT
File Photo

కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు వేసవి రాకముందునుంచే సెలవులు ప్రకటించారు. ఇక ఈ వేసవిసెలవులు కూడా ముగియడానికి నెలరోజుల కంటే తక్కువగానే ఉండడంతో వచ్చే విద్యాసంవత్సరాన్ని ముందులాగానే జూన్‌ 12వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభిస్తాయనే అభిప్రాయాన్ని విద్యాశాఖవర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులను బట్టి లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించినప్పటికీ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరులో లేదా, జూన్ మొదటి వారంలో లాక్ డౌన్ ఎత్తేస్తే తరగతులను యథావిధిగా నడిపించి 220 పాఠశాల పనిదినాలను పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు.

అనుకున్న ప్రకారమే పాఠశాలలను తెరిచి తరగతులు ప్రారంభిస్తే కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యలను పకడ్బందీగా పాటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్ణీతదూరం పాటింటించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక విద్యార్థులందరికీ పాఠాలు బోధించడానికి తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించాలా, పనిగంటల్లో మార్పులు తేవాలా అనే అంశంపై చర్చ కొనసాగుతుందన్నారు. దీనిపై స్పష్టతను త్వరలో చెపుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల కొరత వల్ల రొటేషన్‌ పద్ధతే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News