బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా జరిగే ఆషాఢం బోనాల పండగ ఈ సారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో బోనాలను ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది.

Update: 2020-06-23 05:06 GMT
Bonala Jatara (File Photo)

ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా జరిగే ఆషాఢం బోనాల పండగ ఈ సారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో బోనాలను ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. అంతే కాదు బర్త్‌డే, పెళ్లిళ్లను కూడా అతి కొద్ది మందితోనే మమ అనిపించేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌ నగరంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు నగరానికి చెందినవే ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏటా వైభవంగా నిర్వహించే బోనాల పండగను ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఈ నెల 25న ప్రారంభం కానున్న గోల్కొండలో ఉత్సవాలు, బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది.

- ఈ నెల 25వ తేదీన గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

- ఈ సంబరాల్లో వేవలం 10 మంది మాత్రమే పాల్గొంటారు.

- గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదు.

- ప్రభుత్వమే అన్ని దేవాయాల్లో పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.

- ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారు.

- ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

- ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలి.


Tags:    

Similar News