బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాచింది. వందల మందిని అనారోగ్యం పాలు చేస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-04-08 15:08 GMT
Representational Image

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాచింది. వందల మందిని అనారోగ్యం పాలు చేస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను తరిమి కొట్టాలంటే వ్యక్తి గత శుభ్రతతో పాటు, పరిసరాల శుభ్రతను కూడా పాటించాలని తెలిపింది. దాంతో వైరస్ మరింత వ్యాపించకుండా ఉంటుందని తెలిపింది. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై తాజా నిషేధం విధించింది.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్లు, సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ కూడా ఉమ్మి వేయరాదని, అలా చేయడం నేరమని హెచ్చరించింది. అంతే కాక అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలని సూచించింది. పాన్‌, గుట్కా, పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. ఎవరైనా వాటిని తిని రోడ్లపై ఉమ్మడం నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక పోతే రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 453 కు చేరిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News