ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Update: 2020-06-02 10:51 GMT

పల్లెల నుంచి పట్టణాల వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ కాన్ బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియా ఏసీటీ కన్వీనర్ రవి సాయల మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏండ్ల కల అని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్నో పోరాటాలు చేసామని దాని ద్వారా సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, రాకేష్ లక్కరసు, వీరేందర్, సాంబరాజు, కిశోర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండంబరంగా నిర్వహించారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా గన్‌పార్క్‌ దగ్గరకు చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అక్కడే 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను సీఎం గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం జెండా ఎగరేస్తారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 2012 జూన్ రెండవ తేదీన రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది దశాబ్దాలుగా పోరాడి ఉద్యమంలో వందలాది మంది బలిదానాలు చేసుకొన్నారు.



Tags:    

Similar News