సోషల్ మీడియా పై కెసిఆర్ ఫైర్

తెలంగాణలో నిర్వహిస్తున్న లాక్ డౌన్ పై తెలంగాణలో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Update: 2020-04-07 05:16 GMT
KCR (File Photo)

తెలంగాణలో నిర్వహిస్తున్న లాక్ డౌన్ పై తెలంగాణలో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని పత్రికలు ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన పత్రికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పీపీఈ కిట్లు, వైద్యులకు సదుపాయాలు, ఔషధాల కొరత ఉందని ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. కుటిల రాజకీయాలను ఇది సమయం కాదని గుర్తుంచుకోవాల న్నారు.

ఇప్పటికే ఆస్పత్రుల్లో 40వేల పీపీఈ కిట్లు ఉన్నాయన్నారు. మరో 5లక్షల కిట్లకు ఆర్డర్‌ చేశాం అని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారికి సరైన సమయంలో సరైన శిక్షలు వేస్తామని హెచ్చరించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఏడురుకొంటున్నప్పుడు మీడియా బాధ్యతగా వ్యహరించాలన్నారు. ఈ సమయంలో అడ్డగోలు రాతలు రాయ్యొదన్నారు. అంతే కాక ఇటు సోషల్ మీడియాపై కూడా ఆయన మండిపడ్డారు.

నరేంద్ర మోదీ దీపారాధన కార్యక్రమానికి పిలుపునిస్తే.. కొందరు నెటిజన్లు ఆ విషయం పై జోకులు వేస్తున్నారని, అది పద్ధతి కాదన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పనులూ ఎందుకు పనులు చేయడం ఎందుకు అని ఆయన పశ్నించారు. దీపారాధన సంఘీభావానికి, చప్పట్లు సంకేతమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి పిలుపులు చాలా ఇచ్చామన్నారు. లోకం ఆగమవుతుంటే కొంతమంది చిల్లర వేషాలు వేయడం సరికాదన్నారు. దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన మీడియాకు వ్యతిరేకం కాదన్నారు. ఎన్నికలకు చాలా సమయముంది. అప్పుడు ఎవరి దమ్మెంతో తెలుస్తుందన్నారు.


Tags:    

Similar News