కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వైరస్ నివారణకు చెపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2020-04-05 13:43 GMT
KCR (File Photo)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వైరస్ నివారణకు చెపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, హోం క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్లలో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది కరోనా నుంచి కోలుకున్నారు, అన్ని విషయాల గురించి ఆరా తీసారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ భవన్‌లో ప్రార్థనలకు ఎంత మంది వెల్లి వచ్చిన వారి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత మందిని గుర్తించారని, ఎంత మందికి పరీక్షలు నిర్వహించారాలో అడిగి తెలుసుకున్నారు. వారికి నిర్వహించే పరీక్షలు ఎంత వరకు వచ్చాయనే విషయాలను అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, నియంత్రణ చర్యలపై ఆరా తీశారు.

ఇక కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో నెలకొన్న లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పేద ప్రజలు, వలస కార్మికులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో తెలుసుకున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ విషయం పై పూర్తివివరాలు కనుగొన్నారు. భవిష్యత్ లో ఏవిధంగా చర్యలు తీసుకోవాలో అన్న అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Tags:    

Similar News