Telangana: వనపర్తిని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలోని వరపర్తి జిల్లాలోని గ్రామాల్లో బుధవారం పర్యటించారు.

Update: 2020-01-29 09:52 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలోని వరపర్తి జిల్లాలోని గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామం ఎంత మేరకు అబివృద్ది చెందిందో పరశీలించారు. అనంతరం గ్రామాధికారులు వనపర్తి తదితన గ్రామాల్లో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక గ్రామస్థులతో కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వారి వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గురించి తెలుసుకున్నారు.

తరువాత తెలంగాణ ప్రభుత్వం నిరుపేద యువతుల పెళ్లి చేయడం కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి అర్హులైన 155 మంది లబ్దిదారులకు ఆయన చెక్కులను అందించారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది సీఎం సహాయ నిధికోసం దరఖాస్తు చేసుకోగా వారికి వచ్చిన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమం తరువాత ఇటీవల వనపర్తి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తున్నారు. తరువాత అక్కడికి వచ్చిన అధికారులు, రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 




Tags:    

Similar News