తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి : గవర్నర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2020-06-02 05:07 GMT
Tamilisai Soundararajan (File Photo)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నూతన రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ది పరచడానికి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత రాష్ట్రానికి దక్కిందని కొనియాడారు. 'నా రాష్ట్రం-నాకు గర్వకారణం' అనే రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రభుత్వాల విజయం ప్రజలెంత సుఖసంతోషాలతో ఉన్నారనే అంశాన్ని బట్టి ఆధారపడుతుంది గవర్నర్ అన్నారు. రాష్ట్రం అతి త్వరలో బంగారు తెలంగాణ సాక్షాత్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

మంత్రి ఈటల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మంది కన్న కల అని ఆయన అన్నారు. 'కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ' అనే నినాదంతో కేసీఆర్ నాయకత్వాన్ని వహిస్తూ ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న విజేయుడు అని సీఎం కేసీఆర్‌ ని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి వేముల దేశమే అబ్బురపడేలా అభివృద్ధిలో నంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కీర్తి ప్రపంచవ్యాప్తమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News