చింతకాయ ధరకు రెక్కలు

బంగారం, వెండి ధరలతో పాటే నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మొన్న టమాట ధర దిగోచ్చిన చింతకాయ ధరకు మాత్రం రెక్కలు వచ్చాయి. ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధర పెంచేశారు.

Update: 2019-09-03 04:11 GMT

బంగారం, వెండి ధరలతో పాటే నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మొన్న టమాట ధర దిగోచ్చిన చింతకాయ ధరకు మాత్రం రెక్కలు వచ్చాయి. ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధర పెంచేశారు. కిలో చింతపండు ధర రూ. 1000. ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట అంగట్లో కిలో చింతకాయల ధర రూ. 1000 చొప్పున విక్రయించారు. ఇటు నారాయణఖేడ్, సంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రం కిలో రూ.350, రూ.400, రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం కిలో చింతకాయలు రూ.600లు పలుకుతుంది. ఇక హోల్ సెల్, రైతు బజార్లలో రూ.550 వరకు పలకగా.. బహిరంగ మార్కెట్‌లో అయితే.. 50 గ్రాముల చింతకాయలు రూ.50 పలుకుతుందట.. అంటే కిలో రూ.వెయ్యి అన్నమాటగా. దీంతో చింతకాయను బాగా తగ్గించి వాడుతున్నారట. హైదరాబాద్‌ మార్కెట్లలో చింతకాయ ధర భారీగా పెరిగిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యింది. అయితే చింతకాయ ధర ఆకాశాన్ని అంటడానికి గల కారణం ఇటీవల కురిసిన వర్షాలకు చింత పూవు రాలిపోవడం.. కాయలు సైతం పిందె దశలో ఉండిపోవడంతో చింతకాయలు మార్కెట్‌కు తక్కువగా రావడమే ధరల పెరుగుదలకు కారణం అని రైతులు చెబుతున్నారు.

Tags:    

Similar News