వనదేవతల జాతరకు ప్రత్యేక హెలికాప్టర్‌ సర్వీసులు

వనదేవతల కుంభమేళా మొదులు కానుంది. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లతో జాతరలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Update: 2020-02-02 06:23 GMT

వనదేవతల కుంభమేళా మొదులు కానుంది. ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లతో జాతరలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా భక్తుల సౌకర్యార్థం ఇప్పటికు ఈ జాతరకు భక్తులలు చేరుకోవడానికి ఇటు ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులను నడిపిస్తుండగా, దక్షిణ మధ్య రైల్వే కూడా 20 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అంతే కాక తెలంగాణ పర్యటక శాఖ ఒక రోజు టూర్ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే సమ్మక్క - సారలమ్మల మహాజాతరకు వెల్లే పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం జాతకు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ప్రారంభించారు

ఇక ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు ఆరుగురు ప్రయాణికులకు వెళ్లాలంటే 1లక్ష 80 వేల చార్జి తీసుకుంటున్నారు. అంతే కాకుండా జీఎస్టీని కూడా పర్యటకులే భరించుకోవాలి. భక్తులను హెలీకాప్టర్లో జాతరకు చేర్చడం మాత్రమే కాకుండా వారికి సమ్మక్క, సారలమ్మల దర్శనం కూడా దగ్గరుండి చేపిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. అంతే కాకుండా అదనంగా రూ.2999 చెల్లిస్తే మేడారం జాతరను పూర్తిగా హెలికాప్టర్‌ ద్వారా చూపిస్తామని తెలిపారు. భక్తులు, పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్‌ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Full View


Tags:    

Similar News