సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. పాము సీపీ సజ్జనార్ ఇంట్లో దూరినపుడు ఆయన ఇంట్లోనే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Update: 2020-03-28 11:26 GMT

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇంట్లో పాము కలకలం రేపింది. పాము సీపీ సజ్జనార్ ఇంట్లో దూరినపుడు ఆయన ఇంట్లోనే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది.సీపీ సజ్జనార్ కుటుంబం హైదరాబాద్ లక్డీకపూల్ డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. కాగా శనివారం ఉదయం ఆయన ఇంట్లోకి ఐదు అడుగుల ఓ పాము చొరబడింది. దాన్ని గమనించిన సజ్జనార్ వెంటనే ఆ విషయాన్ని తన సిబ్బందికి తెలిపారు. దాంతో వారు పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌ కు సమాచారం ఇచ్చారు.

హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేష్ సమాచారం అందుకోగానే సజ్జనార్ ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఆ పాము కదలికలను గమనించి దాన్నితన నైపుణ్యం ఉపయోగించి చాకచక్యంగా పట్టేసుకున్నారు. ఆ తరువాత తన వెంట తెచ్చిన ఓ భ్యాగులో వేసుకుని, దాన్ని నెహ్రూ జువలాజికల్ పార్కు అధికారులకు అప్పగిస్తానని వెంకటేష్ తెలిపారు. అది విషపూరితమైనది, ఎవరికీ ఏ హానీ చేయదని కానిస్టేబుల్ చెప్పారు. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టక ముందే పామును పట్టుకున్నందుకు కానిస్టేబుల్ ని కమిషనర్ అభినందించి, బహుమతిని అందజేసారు. కాగా స్థానికులు ఆ పాము ఏడాది కాలంగా ఆ ప్రాంతంలోనే తిరుగుతుందని చెప్పారు.

అనంతరం సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ పామును చూసి ఎవరూ కూడా భయపడకూడదని, దాన్ని కొట్టొద్దని తెలిపారు. పాము కనిపిస్తే వెంటనే పాములను రక్షించే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. మనం వాటికి హాని చేయనంత వరకు అవి మనకు హాని చేయవని తెలిపారు. 

Full View


Tags:    

Similar News