సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతులు డిసెంబర్ నాటికి పూర్తి : జీహెచ్ఎంసీ

Update: 2019-11-12 12:00 GMT

ఆరు నెలలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతు పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్ 1990 లో నిర్మించబడిందని ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఉండడం వలన ఈ ఫ్లైఓవర్ తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీ మరమ్మతు పనులను ప్రారంభించిందని వారు స్పష్టం చేశారు. అంతకుముందు నగర మేయర్, జీహెచ్ఎంసీ అధికారులు ఆగస్టు నాటికి ఈ వంతెన పనులు పూర్తయి ప్రారంభిస్తామని తెలిపినప్పటికీ పనులు పూర్తి అసంపూర్తి కావడంతో ప్రారంభానికి ఆలస్యం అయిందని వారు తెలిపారు.

ఈ మరమ్మతు పనులు ఆలస్యం కావడంతో, ఈసీఐఎల్, మౌలా-అలీ, ఎ.ఎస్.రావు నాగర్, సైనిక్‌పురి ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అంతే కాక తార్నాక చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు తెలుపున్నారు. దీంతో కొంతమంది పౌరులు ఈ సమస్యను మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారుల వద్దకు తీసుకువెళ్లారని దీంతో వెంటే జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి డిసెంబర్ చివరి నాటికి ఫ్లైఓవర్ మరమ్మతు పనులు పూర్తవుతాయని వారు తెలిపారన్నారు.



Tags:    

Similar News