రేపటి నుంచి విద్యాసంస్థలు యథాతథం

రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి యథాతథంగా పనిచేయనున్నాయి. గతనెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు శనివారంతో ముగిశాయని, సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభంకానున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు.

Update: 2019-10-20 06:02 GMT

రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి యథాతథంగా పనిచేయనున్నాయి. గతనెల 28 నుంచి ప్రారంభమైన దసరా సెలవులు శనివారంతో ముగిశాయని, సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభంకానున్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు.

పాఠశాలల్లో ఈ నెల 23 నుంచి ప్రారంభంకావాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తామని చెప్పారు. సరిచేసిన సమ్మెటివ్ -1 టైంటేబుల్‌ను విడుదలచేశామని, ఈ మేరకు విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఇప్పటికే తెలిపారు. వీటితోపాటు డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి అన్ని కాలేజీలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయని ఆయా కళాశాలల యాజమాన్యాలు, విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News