ఆర్టీసీకార్మికుల పట్ల సీఎం చిన్నచూపు తగదు: అశ్వత్థామ రెడ్డి

-రేపు సేవ్‌ ఆర్టీసీ పేరుతో డిపోల ఎదుట నిరసనలు-అశ్వత్థామ రెడ్డి

Update: 2019-11-24 09:27 GMT
అశ్వత్థామరెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సమ్మెకు సంబంధించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 51 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులకు ధర్యవాదాలు చెప్పిన ఆయన సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవహారాలుగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రేపు సేవ్‌ ఆర్టీసీ పేరుతో అన్ని జిల్లాల్లో కార్మికులు డిపోల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌కు చిన్నచూపుతగదన్నారు .

Tags:    

Similar News